శ్రీకృష్ణదేవరాయల చరిత్ర | Sri Krishnadevaraya History in Telugu: విజయనగర సామ్రాజ్య వైభవం
శ్రీకృష్ణదేవరాయల వైభవం: తెలుగు జాతి గర్వించదగ్గ మహాచక్రవర్తి. తెలుగు వారి ముద్దు బిడ్డా అయినా శ్రీకృష్ణదేవరాయలు ఆ నాటి కాలములో అతి గొప్ప
దక్షిణ భారతదేశ చరిత్రను మలుపు తిప్పిన అరుదైన పాలకులలో శ్రీకృష్ణదేవరాయలు ఒకరు. విజయనగర సామ్రాజ్యాన్ని కీర్తి శిఖరాలకు చేర్చిన ఆయన పాలనను మనం 'స్వర్ణయుగం' అని పిలుచుకుంటాం. 1509లో రాజ్య బాధ్యతలు చేపట్టిన రాయల వారు, కేవలం యుద్ధ రంగంలోనే కాదు.. సాహిత్యం, కళలు మరియు ప్రజా సంక్షేమ రంగాల్లోనూ తనకంటూ ఒక చెరగని ముద్ర వేశారు.
యుద్ధ తంత్రం మరియు రాజ్య విస్తరణ:
రాయలు అధికారంలోకి వచ్చే నాటికి రాజ్యం చుట్టూ రాజకీయ అస్థిరత నెలకొంది. బహమనీ సుల్తానుల దాడులు, గజపతుల ఒత్తిడి ఎక్కువగా ఉండేవి. అయితే రాయల వారు తన అసాధారణ యుద్ధ వ్యూహాలతో గజపతులను ఓడించి ఉదయగిరి, కొండవీడు కోటలను కైవసం చేసుకున్నారు. ముఖ్యంగా 'రాయచూర్ యుద్ధం'లో ఆయన చూపిన సాహసం చరిత్రలో నిలిచిపోతుంది. తన శత్రువుల మీద కూడా కనికరం చూపే గొప్ప గుణం ఆయన సొంతం.
సాహిత్యానికి స్వర్ణయుగం:
రాయలు కేవలం కత్తి పట్టిన వీరుడే కాదు, కలం పట్టిన కవి కూడా. ఆయన స్వయంగా రచించిన 'ఆముక్తమాల్యద' గ్రంథం తెలుగు సాహిత్యంలో ఒక ఆణిముత్యం. "దేశ భాషలందు తెలుగు లెస్స" అన్న ఆయన మాటలు నేటికీ ప్రతి తెలుగు వాడి గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ఆయన ఆస్థానంలోని 'అష్టదిగ్గజాలు' (ఎనిమిది మంది కవులు) తెలుగు భాషకు ఒక కొత్త వోంపును, వేగాన్ని అందించారు. అల్లసాని పెద్దన, తెనాలి రామకృష్ణ వంటి మేధావుల కథలు మనం ఇప్పటికీ చెప్పుకుంటూనే ఉంటాం.
ప్రజా రంజక పాలన:
రాయల కాలంలో విజయనగరం సిరిసంపదలతో తులతూగేది. విదేశీ యాత్రికులు తమ రచనల్లో హంపీ వీధుల్లో రత్నాలను రాశులుగా పోసి అమ్మేవారని రాశారంటే.. ఆ రాజ్యం ఎంత సుభిక్షంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ప్రజల కోసం చెరువులు తవ్వించడం, వ్యవసాయాన్ని ప్రోత్సహించడం మరియు మత సామరస్యాన్ని కాపాడటంలో రాయలూ
వారు ఎప్పుడు ముందుండే వారు.
ముగింపు:
క్రీ.శ. 1529లో రాయల పాలన ముగిసినా, ఆయన వదిలి వెళ్ళిన సంస్కృతి, కట్టడాలు (హంపీ కోటలు, దేవాలయాలు) నేటికీ మనకు స్ఫూర్తినిస్తున్నాయి. తెలుగు భాష ఉన్నంత వరకు, విజయనగర సామ్రాజ్య చరిత్ర ఉన్నంత వరకు శ్రీకృష్ణదేవరాయల పేరు అజరామరంగా నిలిచిపోతుంది.
"శ్రీకృష్ణదేవరాయల పురాతన చిత్రపటం - చారిత్రక సేకరణ."

Very nice
ReplyDelete