శ్రీకృష్ణదేవరాయల చరిత్ర | Sri Krishnadevaraya History in Telugu: విజయనగర సామ్రాజ్య వైభవం
శ్రీకృష్ణదేవరాయల వైభవం: తెలుగు జాతి గర్వించదగ్గ మహాచక్రవర్తి. తెలుగు వారి ముద్దు బిడ్డా అయినా శ్రీకృష్ణదేవరాయలు ఆ నాటి కాలములో అతి గొప్ప దక్షిణ భారతదేశ చరిత్రను మలుపు తిప్పిన అరుదైన పాలకులలో శ్రీకృష్ణదేవరాయలు ఒకరు. విజయనగర సామ్రాజ్యాన్ని కీర్తి శిఖరాలకు చేర్చిన ఆయన పాలనను మనం 'స్వర్ణయుగం' అని పిలుచుకుంటాం. 1509లో రాజ్య బాధ్యతలు చేపట్టిన రాయల వారు, కేవలం యుద్ధ రంగంలోనే కాదు.. సాహిత్యం, కళలు మరియు ప్రజా సంక్షేమ రంగాల్లోనూ తనకంటూ ఒక చెరగని ముద్ర వేశారు. యుద్ధ తంత్రం మరియు రాజ్య విస్తరణ: రాయలు అధికారంలోకి వచ్చే నాటికి రాజ్యం చుట్టూ రాజకీయ అస్థిరత నెలకొంది. బహమనీ సుల్తానుల దాడులు, గజపతుల ఒత్తిడి ఎక్కువగా ఉండేవి. అయితే రాయల వారు తన అసాధారణ యుద్ధ వ్యూహాలతో గజపతులను ఓడించి ఉదయగిరి, కొండవీడు కోటలను కైవసం చేసుకున్నారు. ముఖ్యంగా 'రాయచూర్ యుద్ధం'లో ఆయన చూపిన సాహసం చరిత్రలో నిలిచిపోతుంది. తన శత్రువుల మీద కూడా కనికరం చూపే గొప్ప గుణం ఆయన సొంతం. సాహిత్యానికి స్వర్ణయుగం: రాయలు కేవలం కత్తి పట్టిన వీరుడే కాదు, కలం పట్టిన కవి కూడా. ఆయన స్వయంగా రచించిన 'ఆముక్తమాల్యద' గ్రంథం తెలుగు ...
Keep it up
ReplyDeleteThank you bro
Delete